కమ్మేసిన పొగమంచు… 20మంది ప్రయాణికులతో వెళ్తోన్న బోలెరో బోల్తా

by srinivas |
Bolero accident
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి పూట‌ కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా ప‌డిపోతున్నాయి. తెల్లవారుజామున అయితే భారీగా పొగమంచు కురుస్తోంది. ఈ పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖలో కూడా ఆదివారం తెల్లవారుజామున ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 20మంది ప్రయాణికులతో కూడిన బొలెరో వాహనం రోడ్డుప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం జిల్లాలోని జి మాడుగుల మండలం కొడపల్లి గ్రామంలో తెల్లవారుజామున బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. పొగమంచుతో దారి సరిగ్గా కనిపించకపోవడంతో వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. మిగిలిన వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed