- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివాదంలో చిక్కుకున్న బోధన్ ఎమ్మెల్యే.. గ్రామస్తులను బండ బూతులు తిడుతూ..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చాడని గ్రామస్తులు తమ సాధక బాధకాలు చెబుతామనుకున్నారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం తెలుసుకుని, రైతులకు సముదాయించాలని బోధన్ ఎమ్మెల్యే షకిల్ అమేర్ వచ్చాడు. గ్రామంలో పంట నష్టాన్ని అధికారులతో కలిసి పరిశీలించి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామస్తులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకుని తమ కష్టనష్టాలను వినాలని కోరారు. కొద్దిగా ముందుకు అగిన తరువాత వింటా అని అన్నారు ఎమ్మెల్యే. వారు ససేమిరా అనడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. అయినా గ్రామస్థులు వినలేదు.
చివరకు అసహనానికి గురైన ఎమ్మెల్యే బూతుపురాణం అందుకున్నాడు. దానికి ప్రతీగా ఒక గ్రామస్తుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేను సైతం తిట్టిపోశారు. కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎమ్మెల్యే బూతు పురాణం బహిర్గతమైంది.ఈ ఘటన బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో చోటుచేసుకుంది. చాలా రోజుల పాటు నియోజకవర్గం వైపు ముఖం చాటేసిన ఎమ్మెల్యే తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎకరువు పెడుదామంటే కాంగ్రెస్ ప్రాబల్యమున్న గ్రామం అని పట్టించుకోకపోవడంతో ఈ వివాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.