సెల్‌ఫోన్‌ లంచం తీసుకున్న సీఐ..

by Anukaran |   ( Updated:2020-10-31 05:36:04.0  )
సెల్‌ఫోన్‌ లంచం తీసుకున్న సీఐ..
X

దిశ, వెబ్ డెస్క్/ బోదన్ : నిజామాబాద్ జిల్లా బోధన్‌ సీఐ పల్లె రాకేష్ గౌడ్ ఏసీబీ వలకు చిక్కాడు. రూ.80వేలు, ఖరీదైన సెల్‌ఫోన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సాజిద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇదేక్రమంలో పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… శనివారం మధ్యాహ్నం సీఐని చాకచక్యంగా పట్టుకున్నారు.కాగా సీఐ రాకేష్ గౌడ్ సివిల్ కేసులో లంచం తీసుకుంటు దొరకడం కలకలం రేపింది. సీఐ ఇంట్లో, కార్యాలయంలో సోదాలను నిర్వహిస్తున్నారు. బోదన్ సీఐగా ఉన్న పల్లె రాకేష్ గౌడ్ గతంలో నిజామాబాద్ నగరంలో ఎస్ఐగా పనిచేశారు.

Advertisement

Next Story