- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై ప్లాంట్‌లో బీఎండబ్ల్యూ కార్యకలాపాల పునరుద్ధరణ!
దిశ, సెంట్రల్ డెస్క్: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ సోమవారం చెన్నై ప్లాంట్‌లో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ 50 శాతం కంటే తక్కువ సిబ్బందితో పనులు మొదలుపెట్టినట్టు సంస్థ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్లాంట్ పరిసరాల్లో అవసరమైన అన్నిరకాల రక్షణ చర్యలను చేపట్టినట్టు, కార్యాలయాల్లో, డీలర్‌షిప్ లేఅవుట్లను రీడిజైన్ చేశామని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ప్రదేశాల్లో శానిటైజ్ చేసినట్టు తెలిపింది. వినియోగదారులు అడిగిన ప్రాంతాల్లో వాహనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రకాల మోటార్డ్ డీలర్‌షిప్‌లు షోరూమ్‌లలోనూ ప్రదర్శించే వాహనాల శానిటైజేషన్‌పై భరోసా కలిగించేలా ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలుచేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఆర్డర్ చేసిన వాహనాన్ని డెలివరీ చేయడానికి ముందు ప్రతి ఒక్క వాహనానికి ముందు శానిటైజ్ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. టెస్ట్ డ్రైవ్ కోసం కూడా వాహనాలు అందుబాటులో ఉన్నాయన్ని తెలిపింది. టెస్ట్ డ్రైవ్ కోసం ముందుగా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ కోసం కేటాయించిన వాహనాల్లో హ్యాండ్ శానిటైజర్ ఉంచామని కంపెనీ తెలిపింది.