- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లోకి బీఎమ్‌డబ్ల్యూ మినీ కొత్త మోడల్ కార్లు విడుదల!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ఇండియా మంగళవారం తన మినీ బ్రాండ్ విభాగంలో మూడు కొత్త కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మినీ 3-డోర్ హ్యాచ్ ధర రూ. 38 లక్షలు, మినీ కన్వర్టబుల్ రూ. 44 లక్షలు, మినీ జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ రూ. 45.5 లక్షల ధరలో తీసుకొచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సరికొత్త మినీ మోడల్ వేరియంట్లు మూడూ పెట్రోల్ ఇంజిన్లతో లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో కూడా బీఎమ్‌డబ్ల్యూ కొత్త మినీ కంట్రీమేన్ మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ప్రీమియం స్మాల్ కార్ల విభాగంలో మినీ వేరియంట్ గణనీయమైన మార్కెట్‌ను కలిగి ఉందని, కొత్త మోడళ్లతో ఇది మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నట్టు బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా చెప్పారు.
మినీ 3-డోర్ హ్యాచ్, మినీ కన్వర్టబుల్ 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తాయని, 3-డోర్ హ్యాచ్ కేవలం 6.7 సెకెన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, కన్వర్టబుల్ 7.1 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వివరించింది. ఇక, జాన్ కూపర్ వర్క్స్ హ్యాచ్ 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది.