ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగవంతం : బీఎండబ్ల్యూ!

by Harish |
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగవంతం : బీఎండబ్ల్యూ!
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆలివర్ జిప్సే తెలిపారు. ‘ తాము ఎలక్ట్రిక్ వాహనాలను గణనీయంగా పెంచాలని నిర్ణయించాం. 2021-2023 మధ్య అనుకున్న దానికంటే 2.5 లక్షల ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని అనుకుంటున్నామని’ ఆయన వివరించారు. 2023 నాటికి కంపెనీ విక్రయించే ప్రతి ఐదవ కారు ఎలక్ట్రిక్ కారు అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణనూ వేగవంతం చేయనున్నట్టు, తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇప్పటినుంచి ప్రతి వారం 15 వేల ప్రైవేట్, 1,300 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆలివర్ జిప్సె వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed