కరోనా పాజిటివ్ వచ్చినా షూటింగ్ వెళ్లిన నటి.. FIR నమోదు

by Shyam |   ( Updated:2021-03-16 00:48:10.0  )
Bollywood Actress Gauhar Khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ పై FIR ఫైల్ చేసింది బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కొవిడ్ -19 పాజిటివ్ వచ్చిన నటి హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా.. బాధ్యతారహితంగా షూటింగ్ వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు, పోలీసులు. ఇప్పటికే కరోనా చాలా మంది ప్రాణాలు బలి తీసుకుందని, పాజిటివ్ వచ్చిన ఎవరైనా సరే క్వరంటైన్ లో ఉండి, ఇతరులకు కరోనా సోకకుండా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలని కోరారు. కాగా ఈ FIR ను ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేసిన బీఎంసి … సిటీ సేఫ్టీ కోసం కాంప్రమైజ్ అయ్యేదే లేదని, రూల్స్ అందరికీ సమానమే సిటిజన్స్ అందరూ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ముంబై సిటీని కరోనా ఫ్రీ గా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే కొవిడ్ రూల్స్ అతిక్రమించిన బాలీవుడ్ నటిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ వివరాలను బిఎంసి గోప్యంగా ఉంచినా మీడియా బయట పెట్టేసింది.

Advertisement

Next Story