నో మాస్క్.. ఒక్కరోజులోనే రూ.45.96 లక్షల ఫైన్ వసూల్

by Shamantha N |
నో మాస్క్.. ఒక్కరోజులోనే రూ.45.96 లక్షల ఫైన్ వసూల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు మొన్నటివరకు తగ్గుముఖం పట్టినా మళ్లీ విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మహా సర్కార్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించింది.అంతేకాకుండా, కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మాస్కు ధరించని వారిపై బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝలిపిలిస్తున్నారు.

మార్చి 11వ తేదీన బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని 23,160 మంది నుంచి ముంబై పోలీసులు రూ.45.96 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ మొత్తం కలెక్షన్లలో వివిధ రైల్వే స్టేషన్లలో 537 మంది నిబంధనలు ఉల్లంఘించగా, వారి నుంచి రూ.1,07,400 వసూలు చేశారు. ఈ సందర్భంగా బీఎంసీ అదనపు కమిషనర్ (పశ్చిమ శివారు) సురేష్ కాకాని మాట్లాడుతూ.. మరల లాక్డౌన్ విధించటానికి తాము ప్రణాళిక చేయనప్పటికీ, ఎంతకాలం ఇలా మాస్కు ధరించని వారిని పట్టుకోగలమో తెలీదు. కావున, విధిగా అందరూ మాస్కు ధరించి కొవిడ్ నివారణకు తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు.

Advertisement

Next Story