తంగడపల్లి రోడ్ల వెంట రక్తపు మరకలు

by Shyam |
తంగడపల్లి రోడ్ల వెంట రక్తపు మరకలు
X

దిశ, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లిలో రోడ్ల వెంట రక్తపు మరకలు కలకలం రేపాయి. గ్రామంలోని ముదిరాజ్ కాలనీలో రోడ్ల వెంట రక్తపు మరకలు కన్పించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. రక్తపు మరకలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మిగిలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు తంగడపల్లికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. బుధవారం అమవాస్య కావడం వల్ల ఎవరైనా బాణమతి పూజల కోణంలో ఏదైనా చేశారా.. లేకపోతే మరేదైనా కారణమా అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐదో వార్డులో పడిన రక్తపు మరకలు ఏదైనా జంతువుయా.. లేక మనిషివా అన్న కోణంలోనూ విచారించేందుకు శాంపిల్స్‌ను సేకరించారు.

Tags: Blood, stains, Thangadapalli, roads, nalgonda, bhuvanagiri, police

Advertisement

Next Story