అంధ ఉద్యోగిని చేయూత

by Shyam |   ( Updated:2020-03-30 05:07:44.0  )
అంధ ఉద్యోగిని చేయూత
X

దిశ, మెదక్: ఉద్యోగం చిన్నదైనా.. భార్యాభర్తలిద్దరూ అంధులైనా వారి మనస్సు మాత్రం చాలా పెద్దది. కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం తమవంతు సాయం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంధ ఉద్యోగిని డి. భాగ్య పారిశుద్ధ్య కార్మికుల కోసం తన నెల జీతం రూ.25వేలను విరాళంగా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కష్టపడి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం తనవంతు సాయమంటూ మంత్రి హరీశ్ రావుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. వీరి స్ఫూర్తితో చేయి చేయి కలిపి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. అనంతరం భాగ్య సేవాగుణానికి మంత్రి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

tags:blind employee, salary donated, siddipet, harish rao, coronavirus, municipal workers

Advertisement

Next Story