నల్లధనం తగ్గింది: ప్రధాని

by Anukaran |
నల్లధనం తగ్గింది: ప్రధాని
X

దిశ, వెబ్ డెస్క్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నాలుగేళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని మోడీ ఆదివారం స్పందించారు. ‘ఈ నిర్ణయం నల్లధనాన్ని తగ్గించడానికి ఉపకరించింది. పన్ను కట్టే ప్రవర్తనను ప్రోత్సహించింది. పారదర్శకతకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. మొత్తంగా దేశ పురోగతికి నోట్ల రద్దు తోడ్పడింది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో నగదుపై ఆధారపడటం ఎలా తగ్గుతూ వచ్చిందో వివరించే పత్రాన్ని, జీడీపీకి పన్నులు నిష్పత్తి సహా మరికొన్ని విషయాలను వివరించే చిత్రాలను ట్వీట్‌తో జతచేశారు.

Advertisement

Next Story