- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూమిలో పాతిపెట్టిన టిఫిన్ బాక్స్.. బాంబ్ అనుకుని తెరిస్తే అంతా షాక్!
దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో టిఫిన్ బాక్స్ కలకలం రేపింది. మరిమడ్ల–మానాల రోడ్డులో టిఫిన్ బాంబు ఉందనే సమాచారం మేరకు పోలీసులు, బాంబు స్వ్కాడ్‌తో ఘటనా స్థలికి వెళ్లారు. ఆరు గంటల పాటు శ్రమించిన పోలీసులు తీరా టిఫిన్ బాంబ్ బాక్స్‌ను బయటకు తీసి చూడగా అంతా షాక్‌కు గురయ్యారు. అందులో బాంబ్ లేకపోగా, నల్ల కోడి, కొబ్బరికాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా బాంబు స్క్వాడ్ ఆర్ఐ కుమారస్వామి మాట్లాడుతూ.. టిఫిన్ బాక్స్‌లో బాంబు ఉందనే అనుమానంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్థానిక ఎస్సై రాజశేఖర్‌కు సమాచారం అందించారని గుర్తుచేశారు.
దీంతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో మరిమడ్ల అటవీ శివారులో టిఫిన్ బాక్స్ ఉన్న ప్రదేశానికి వెళ్లి పోలీసులు బాంబ్ డిస్పోజల్ టీం ద్వారా పరిశీలించారు. దానిని జేసీబీ సాయంతో బయటికి తీసినట్లు తెలిపారు. ప్రజలను భయం భ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే, చేతబడి చేసి టిఫిన్ బాక్స్ లో నల్ల కోడిని పెట్టి పూడ్చారని, అందులో ఎటువంటి బాంబు లేదన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులను భయబ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో టిఫిన్ బాక్స్ పాతి పెట్టి ఉంటారనీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎవరూ భయ పడవద్దనీ ఈ దారి గుండా రాకపోకలు సాగించవచ్చన్నారు. పోలీసులు ఎప్పుడు ప్రజల భద్రత కోసమే పని చేస్తారనీ అన్నారు. ఆయన వెంటన రుద్రంగి ఎస్సై మహేశ్, సర్పంచ్ అశోక్, పోలీసులు ఉన్నారు.