భద్రాచలంలో బ్లాక్ ఫంగస్ కలకలం

by Sridhar Babu |
భద్రాచలంలో బ్లాక్ ఫంగస్ కలకలం
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌‌ కేసుకి చికిత్స జరుగుతోంది. అన్నపు రెడ్డిపల్లి మండలానికి చెందిన సులోచన అనే మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. అయితే ఆమెకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిట్ నిర్ధారణ అయ్యింది. దాంతో ఆమె ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఈ మధ్యనే కోలుకుంది. ఆమెకు కొవిడ్ తగ్గిన తర్వాత ఆమెలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారి కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను బంధువులు హైదరాబాద్ నుంచి భద్రాచలానికి షిప్టు చేసినట్లుగా తెలిసింది.‌ ఇక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొవిడ్ వైరస్‌తో భద్రాచలం ఏజెన్సీ వణుకుతుండగా, ఇపుడు బ్లాక్ ఫంగస్ కేసులు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed