బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

by Shyam |
బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాచారంలో బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక బీజేపీ నాయకురాలు విజయలతారెడ్డి టికెట్ ఆశించింది. చివరకు టికెట్‌ దక్కకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంతేగాకుండా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్‌ తనకు టికెట్‌ రాకుండా చేశారని ఆమె ఆరోపణలు చేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే విజయలతారెడ్డి గత జీహచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story