- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్కు అనుకూలంగా వార్డుల విభజన
దిశ, సిద్దిపేట: టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. సిద్దిపేట బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 3 టీఎంసీల నీటి తరలించడానికి చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల సవరణ, మున్సిపల్ పరిధి విస్తరణ టీఆర్ఎస్‌కు అనుకూలంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ కేడర్ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యాదర్శులు మోహన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బూర్గు సురేష్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి గుండ్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.