- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు!
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ) నిర్మాణాత్మక మార్పులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) మాదిరిగానే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించి ఇద్దరికీ సమాన బాధ్యతలు అప్పజెప్పేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకే ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రధానంగా జితేందర్ రెడ్డి, డీకే అరుణ పోటీపడుతుండగా జాతీయ నాయకుల మద్దతు ఉన్నవారికే ఈ పదవి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డీకే అరుణకు జాతీయ నాయకుల మద్దతు పుష్కలంగా ఉండటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. డీకే అరుణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కేంద్ర పరిశీలకులు సోమవారం ఆరుగురు నేతలకు సంబంధించి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. సిట్టింగ్ ఎంపీలైన డి.అర్వింద్, బండి సంజయ్‌లు ఈ పదవిపై కన్నేయగా, సీనియర్ నాయకులు పేరాల శేఖర్, మాజీ టీఆర్ఎస్ నేత ఒకరు కూడా రేసులో ఉన్నారు. మరోసారి తననే కొనసాగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్ద నాయకుల మద్దతు కోసం…
సంజయ్ అధ్యక్ష పదవిపై మొదట ఆసక్తి చూపకపోయినా ప్రస్తుతం ఆయన కూడా పార్టీలోని పెద్ద నాయకుల మద్దతు కోరుతుండటం గమనార్హం. అదీగాక ప్రధానంగా పోటీలో ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్‌లిద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం విశేషం. మళ్లీ లక్ష్మణ్‌కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా మరో వారం రోజుల్లో నూతన అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.