- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేటీఆర్ సీఎం చేస్తే అణుబాంబ్ పేలుతుంది’
దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన అద్భుతమైన నటనను రాజకీయ తెరపై ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఫాంహౌస్‌లో చేసిన శనిపూజ ద్రవ్యాలను కాళేశ్వరంలో కలిపేందుకు ఆకస్మిక పర్యటన చేపట్టారని అన్నారు. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో అణుబాంబ్ పేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బండి సంజయ్ హన్మకొండలో పర్యటించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాతృమూర్తి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వెనుక అసలు రహస్యం శనిపూజ కోసమేనన్నారు.
తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ పొత్తుల పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ నాతో ఢిల్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. పొత్తులపై ఎవరు హామీ ఇచ్చారో తేలుస్తా. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్‌తో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తుపెట్టుకోదు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌పై అసహనంతో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే పొత్తుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు. యాక్షన్‌లో కేసీఆర్‌ను మించిన నటుడు లేడు. కేసీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తే టేకాఫ్ లేకుండా 20 గంటల్లో షూటింగ్ పూర్తవుతుంది’ అని బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.