‘ప్రభుత్వం ప్రజలకు.. వాస్తవాలు తెలుపాలి’

by Sridhar Babu |
‘ప్రభుత్వం ప్రజలకు.. వాస్తవాలు తెలుపాలి’
X

దిశ, మంచిర్యాల: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓ.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. వరంగల్‌లో ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రతిఘటన చేయడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌లో భాగంగా తెలంగాణకు రూ.7151 కోట్లు కేటాయించిందన్నారు.

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని, టెస్టుల సంఖ్య పెంచకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో కార్మికుల రక్షణ కోసం ఏ మాత్రం వైద్య సదుపాయాలు అందిస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వేల కోట్లు వస్తుంటే ప్రభుత్వం కరోనాను కట్టడి చేయకుండా ఆ నిధులను, ఇతర రంగాలకు మళ్లిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కరోనాను కట్టడి చేసి వాస్తవాలు ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed