- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధినేని యామినిపై రెచ్చిపోయిన హీరోయిన్లు
దిశ,వెబ్‌డెస్క్: సాధినేని యామిని అనగానే గులాబీ పువ్వు గుర్తుకొస్తుంది. కానీ ఏపీ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి అనగానే ఆ పువ్వు కింద ఉండే ముళ్లు గుర్తుకొస్తాయి. గులాబీ ఎంత అందంగా ఉంటుందో ఆ ముళ్లు అంత డేంజెరస్ గా ఉంటాయి. యామిని మాటలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. అగ్ని పర్వతంలా నిరంతరం లావాలా ఉబికి వస్తూనే ఉంటుంది. ఆ లావా లాంటి ఆరోపణలు, విమర్శల సెగ ప్రత్యర్ధికి సూటిగా తాకుతుంది. ఆ దెబ్బకు శత్రువు ఆవేశంతోనన్నా రగిలిపోవాలి. లేదా ఆవేదన తోనైనా కుమిలిపోవాలి. పార్టీ ఏదైనా సరే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే చాలు ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అవతల ఉంది మాజీ బాసైనా, బిగ్ బాసైనా డోంట్ కేర్ ఆవేశంతో లోడ్ చేసిన గన్ నుంచి మాటల తూటాలను నాన్‌స్టాప్ గా పేల్చేస్తుంది. అనొచ్చా అనకూడదా అనే డౌట్లు ఆమె మనస్సుకి అసలు తట్టవ్. మాటల ఔట్లు పేల్చడమే లక్ష్యంగా స్పీచ్ పీక్స్‌కు వెళ్లిపోతుంది. ఫైర్ బ్రాండ్ బిరుదు ఎంతమందికున్నా..ఇప్పుడు అసలు సిసలు ఫైర్ బ్రాండ్ యామనీయే. అంతటి ఫైర్ బ్రాండైన యామినికి ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు బీజేపీ నేత సాధినేని యామని. ముందుగా టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ పార్టీలో సబ్జెట్ తో మోత మోగించేసింది. పార్టీలైన్ కు ఆటోమెటిగ్గా కనెక్టై ట్రాన్స్ ఫార్మర్‌లా పేలింది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె మాటల వాగ్ధాటికి ఫిదా అయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధిగా పీఠం కట్టబెట్టారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పైనా, ఆయన కుమారుడు లోకేష్‌పై ప్రత్యర్థులు ఈగవాల్చినా యామిని కత్తుల్లాంటి మాటలతో దాడిచేసేది. అయితే ఎందుకో ఏమో కాలం గడిచే కొద్దీ యామినిపై సొంతపార్టీ నేతలే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలు పెట్టారు. ఆ ప్రచారం తట్టుకోలేక ఒకానొక సమయంలో పెళ్లైన ఆడదాన్ని నన్ను నాకుటుంబాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారంటూ టీడీపీ పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే ఆ తరువాత బీజేపీ అధికారంలో రావడం, ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి మెచ్చి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన యామినికి కమలం అధినేతలు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టిన యామిని కొంతకాలం సైలెంట్ గా ఉన్నా.. విగ్రహాల ధ్వంసంతో మళ్లీ ఒక్కసారి వెలుగులోకి వచ్చారు. ఫైర్ బ్రాండ్ గా తన హవా కొనసాగిస్తున్నారు. దీంతో ఆమెపై బీజేపీకి చెందిన మహిళా నేత మాధవీలత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. యామిని పేరు ప్రస్తావించకుండానే మండిపడుతున్నారు. తాజాగా మాధవీలత సాధినేని యామినీపై సెటైర్లు వేశారు. జంపింగ్ జపాంగ్‌లకే పార్టీ నేతలు కీలక పదవులు ఇస్తున్నారని, కష్టపడి పార్టీ కోసం పని చేసే వాళ్లకు గౌరవం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాలింది అనుకోండి.. కడుపు మంట అనుకోండి.. కాని నేను చెప్పేది నిజం.. పచ్చ కండువాలు కప్పుకుని పచ్చి బూతులు తిట్టి అధికారం లేకపోవడంతో పార్టీలు మారే వారికే పదవులు కట్టబెట్టారంటూ మాధవీలత విమర్శించారు. ఇదే ఇష్యూ పైన సినీ నటి పూనమ్ కౌర్ కూడా ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. చీర కట్టు.. బొట్టు పెట్టు.. తిట్టు.. పదవి పట్టూ ట్వీట్ చేశారు. మరి ఆమె ట్వీట్ ఏం ఉద్దేశంతో చేశారో ఆమెకే తెలియాలి మరి.