నేను మావోయిస్టులకే భయపడలేదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Aamani |
నేను మావోయిస్టులకే భయపడలేదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే జోగు రామన్నపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే జోగు రామన్న పెద్ద అవినీతిపరుడు అంటూ మండిపడ్డారు. జోగు రామన్న మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజాసొమ్మును దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనను బెదిరింపులకు గురిచేస్తే.. బెదరబోనని తెలిపారు. ‘నేను మావోయిస్టులకే భయపడలేదు.. మీకు భయపడతానా’ అని అన్నారు. సోయం బాపూరావు దండు కదిలితే జోగు రామన్న అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. ఇప్పటికైన అనవసర రాజకీయాలు మానేసి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడండి అంటూ హితవు పలికారు. లేదంటే కథ కంచితే అంటూ సోయం బాపూరావు హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

Next Story