బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదం

by Shamantha N |   ( Updated:2020-11-17 00:33:46.0  )
బీజేపీ ఎంపీ ఇంట్లో విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ (BJP MP Rita Bahuguna Joshi) ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా టాపాసులు పేలుస్తున్న రీటా మనుమరాలికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనిని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 60 శాతానికి పైగా కాలిపోయిన చిన్నారి(8) చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మృతిచెందింది. మనుమరాలు మృతిచెందడంతో ఎంపీ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ప్రయాగ్రాజ్‌లోని ఆమె నివాసంలో చోటుచేసుకుంది.

Advertisement

Next Story