- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా వాళ్లు టూర్‌కు వెళ్లారు : రాజస్థాన్ బీజేపీ చీఫ్
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. మొన్నటిదాకా అక్కడి అధికార పార్టీ కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేల పోరుతో కీలక నేత సచిన్ పైలట్, అతని వర్గీయులపై స్పీకర్ షోకాజ్ నోటిసులు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు కనిపించకుండా పోయారని.. ఆ విషయాన్ని బీజేపీ దాస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
దీనిపై స్పందించిన రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా.. తమ 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌కు విహార యాత్ర కోసం వెళ్లారని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలందరూ ఐక్యంగానే ఉన్నారని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ కావాలనే లేని పోని పుకార్లు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.
తమ ఎమ్మెల్యేలు 12మంది విహార యాత్ర కోసమే వెళ్ళారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగేరోజు వారంతా కచ్చితంగా వస్తారని సతీష్ పూనియా వివరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సంఘటితంగానే ఉన్నారని.. కావాలనే అధికార కాంగ్రెస్ లేనిపోని పుకార్లు సృష్టిస్తోందని పూనియా మండిపడ్డారు.
తమ ఎమ్మెల్యేలపై పూర్తి నమ్మకం ఉందని.. కాంగ్రెస్సే వారి ఎమ్మెల్యేలను నమ్మదని ఆయన ఆరోపించారు.అంతేకాకుండా రాజస్థాన్ పోలీసులు సీఎం గెహ్లాట్‌కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలను కావాలనే టార్గెట్ చేస్తున్నారని సతీశ్ పూనియా తీవ్రంగా ఆరోపించారు.