- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ ప్రభుత్వం ఉన్నా.. తమకు రావాల్సినవి ముక్కుపిండి వసూలు చేస్తాం
దిశ, దుబ్బాక: రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు శాసన సభలో రేషన్ కార్డుల అంశాన్ని బీజేపీ తరపున తాము లేవనెత్తినందుకే నేడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరుగదు అని ప్రచారం చేస్తున్న వారి మాటలు నమ్మొద్దని, తమకు రావాల్సిన నిధులు ముక్కు పిండి వసూలు చేస్తామన్నారు. ఏదేమైనా పేద ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.