మంత్రి సబితా, ఎమ్మెల్యే సుధీర్ ఇలాకాలో ఎదురుగాలి

by Shyam |   ( Updated:2020-12-04 04:12:52.0  )
మంత్రి సబితా, ఎమ్మెల్యే సుధీర్ ఇలాకాలో ఎదురుగాలి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాకాలో బీజేపీ హావా కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ముందజలో ఉంది. మొత్తం 11 డివిజన్లు ఉంటే ఒక బీఎన్ రెడ్డి తప్పా మిగిలినవన్నీ బీజేపీ లీడ్ చేస్తోంది. చంపాపేట్ డివిజన్‎లో వంగ మధుసూధన్ రెడ్డి గెలుపొందడంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఖాతా తెరిచింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం, సరూర్‎నగర్ డివిజన్‎లో సైతం బీజేపీ ముందంజలో ఉంది.

Advertisement

Next Story