మొదటి రౌండ్‎లో బీజేపీ అధిక్యం

by Shyam |   ( Updated:2020-11-09 22:38:41.0  )
మొదటి రౌండ్‎లో బీజేపీ అధిక్యం
X

దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో బీజేపీ 3,208 ఓట్లతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో టీఆర్ఎస్ 2,867, తరువాత స్థానంలో కాంగ్రెస్ 648 ఓట్లు పోలయ్యాయి. మొదటగా 1,453 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 51 సర్వీస్ ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాకలో మొత్తం ఓట్లు 1,98,756 కాగా.. 1,64,192 ఓట్లు పోలయ్యాయి. దుబ్బాకలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed