- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేటర్ ఇంటిపై దాడి చేసిన బీజేపీ నాయకులు.. ఆ మంత్రే కారణం అంటూ ఫైర్..
దిశ, జల్పల్లి: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్‌గా గెలిచిన ఎం.నరేంద్ర కుమార్, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్పార్టీలో చేరారు. దీనితో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 13వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రకుమార్ వెంటనే కార్పొరేటర్పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఇంటిని బీజేపీ నాయకులు ముట్టడించడానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పలువురి బీజేపీ నాయకులను వాళ్ళ ఇండ్ల వద్దనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కాగా మీర్‌పేట్ మున్సిపల్కార్పొరేషన్కు చెందిన 36వ డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు వరికుప్పల బుచ్చిరాములు, ధ్యాసాని తిరుపతి రెడ్డి, రాళ్ళగూడం రామకృష్ణారెడ్డి, ధర్మేంద్ర సాగర్, లింగం, ఈశ్వర్, మురళీ చారి, కృష్ణ తదితరులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ బడంగ్‌పేట్‌లోని కార్పొరేటర్ నరేంద్రకుమార్ ఇంటిని ముట్టడించారు.
గుడ్లతో కార్పొరేటర్ ఇంటిపై దాడి చేసిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్అయిన బీజేపీ నాయకులకు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 36వ డివిజన్కార్పొరేటర్ఎడ్ల మల్లేష్ మాట్లాడుతూ. దోచుకున్నవి దాచుకోవడానికి మంత్రి పదవికోసం సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని.. అదే కోవలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ, మీర్‌పేట్‌కు చెందిన ప్రజా ప్రతినిధులను స్వయంగా మంత్రే పార్టీ ఫిరాయింపులు చేయిస్తున్నారని, సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. మొదట సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. .నరేంద్ర కుమార్ కార్పొరేటర్పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఓడిపోతానన్న భయంతోనే మంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.