- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నారు : బీజేపీ నేతలు ఫైర్
దిశ, అల్లాదుర్గ్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాల భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకొనే ఈ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కనుమరుగై పోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ దీక్షకు అల్లాదుర్గం బీజేపీ నాయకులు తరలి వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు అనేక ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు, బలిదానాలు చేశారని అన్నారు. విద్యార్థుల ఆశ, కోరికలు నెరవేర్చకుండా ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ మొండి వైఖరిని విరమించుకొని విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించాలని లేకపోతే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బీజేపీ మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళ రాములు, అల్లాదుర్గ్ టౌన్ ప్రెసిడెంట్ రవి ఉన్నారు.
- Tags
- bjp leaders