ధ‌ర్మారెడ్డి ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పేముంది : మ‌ంత్రి

by Shyam |
ధ‌ర్మారెడ్డి ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పేముంది : మ‌ంత్రి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య నెల‌కొన్న దాడులు-ప్ర‌తిదాడుల నేపథ్యంలో వరంగల్ రాజ‌కీయం వేడెక్కింది. దీంతో పూర్వ వ‌రంగ‌ల్ జిల్లాలో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేపథ్యంలో సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఆయన స్వగృహంలో మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ప్ర‌శ్నిస్తే భౌతిక దాడుల‌కు దిగ‌డం శోచ‌నీయ‌మ‌ని అన్నారు. ఎమ్మెల్యే అడిగిన ప్ర‌శ్న‌ల్లో వివాదాస్ప‌ద‌మైన విష‌యాలేమీ లేవ‌ని అన్నారు. అనంతరం ప్ర‌భుత్వ చీఫ్‌విప్ విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ… బీజేపీ నేత‌లు మ‌మ్మ‌ల్ని రెచ్చ‌గొట్ట‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. చివరగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… బీజేపీ నేత‌ల‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ నాయ‌కులు లెక్క‌ లేకుండా వ‌సూలు చేస్తున్నారని, నా వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటానని స్పష్టం చేశారు. తన ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్ప‌లేద‌ని గుర్తుచేశారు.

బీజేపీ నేత‌ల‌కు 14రోజుల రిమాండ్‌..

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిచేసిన మొత్తం 55 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని సుబేదారి, కేయూ పీఎస్‌ల‌కు త‌ర‌లించారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా అమరేందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్‌, కొలను సంతో్‌షరెడ్డి, రత్నం, మేఘరాజ్‌, సుమన్‌ఖత్రి, కూచన క్రాంతి, జెండా రమేష్‌లతో పాటు మరికొంత మంది ఉన్నారు. అయితే.. చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఇంటిపై దాడికి పాల్ప‌డిన కేసులో వీరందరికీ వ‌రంగ‌ల్ జిల్లా కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం పోలీసులు నిందితుల‌ను సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

Advertisement

Next Story