సీఎం రాజీనామా చేయాలి : బీజేపీ

దిశ, వెబ్ డెస్క్ :
కేరళ గోల్డ్ స్కాం విషయంలో ప్రభుత్వ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గోల్డ్‌స్కాం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం హస్తముందని భావిస్తోన్న బీజేపీ నాయకులు ఢిల్లీలో చేస్తున్న దీక్ష 18వ రోజుకు చేరింది. అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి వి. మురళిధర్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కాగా, 30కిలోల గోల్డ్ స్మిగ్లింగ్ కేసును ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement