గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

by Shyam |
గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు తెలిపామని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ చెప్పారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సైను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజలనాడిని గ్రహించి ప్రజలు బీజేపీ పక్షాన చేరుతారని తెలుసుకుని, శాంతి భద్రతలు తలెత్తుతాయని ప్రకటిస్తున్నాడని మండిపడ్డారు. ‘ఆయన కుమారుడు ఢిల్లీ నుంచి జాతీయ నాయకులొస్తున్నారు… రేపు రేపు ట్రంప్ కూడా రావచ్చంటున్నాడు.. ఎందుకయ్యా ఉలిక్కి పడుతున్నావు.. రేపు మీ సీఎం కూడా రమ్మను నగరంలో తిరుగుమను.. ప్రజలను మీరు మోసం ఎలా చేశారో, దగా చేశారో తెలుస్తుంది’ అని లక్ష్మణ్ అన్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రచారం ముగింపు దశకు వస్తున్నది. ప్రచారం ప్రశాంతమైన, శాంతియుత వాతావరణంలో జరుగుతున్నది. ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కొన్ని శక్తులు జాతి వ్యతిరేక శక్తులు మతకలహాలు సృష్టించేందుకు పన్నాగం పన్నినట్టు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నట్టు తెలిపింది. ఈ వార్త అన్ని ప్రచార మాధ్యమాల్లో వెలువడింది. గత దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి కేటీఆర్ కూడా ఇదే తరహాలో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ప్రత్యేక బలగాలను తెప్పించి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలి. స్వేచ్చగా, స్వచ్చందంగా ఓటింగ్ జరిగేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించాలి. గ్రేటర్ ఎన్నికలు ముగిసే వరకు ముఖ్యమంత్రి సమీక్షా కార్యక్రమాలకు అధికారుల వెళ్ళకుండా సూచనలు చేయాలి. అని మూడు డిమాండ్లను గవర్నర్‌కు సమర్పించిన వినతి పత్రంలో బీజేపీ కోరింది.

Advertisement

Next Story

Most Viewed