కంటోన్మెంట్ పాలక మండలి రద్దుకు వినతి

by Shyam |
కంటోన్మెంట్ పాలక మండలి రద్దుకు వినతి
X

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలిని రద్దు చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ నాయకులు కోరారు. శనివారం కేంద్ర మంత్రిని ఎమ్మెల్సీ రాంచందర్ రావు, కంటోన్మెంట్ నాయకుడు గడ్డం శ్రావణ్ కుమార్‌లు కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి పదవీ కాలం గత ఫిబ్రవరి 10వ తేదీనే ముగిసిందన్నారు.

అయితే కేంద్రం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణకు నాడు సంసిద్దంగా లేకపోవడంతో మరో 6 నెలలపాటు పదవీ కాలాన్ని పొడగిస్తూ.. ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ నెల 10వ తేదీ పొడగించిన గడువు ముగుస్తుందని, మరోసారి పదవి కాలాన్ని పొడగించడం వల్ల ప్రస్తుతం ఉన్న బోర్డు పాలక మండలి సభ్యులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని, దీని వల్ల ప్రజలకు ఏలాంటి ఉపయోగం లేదన్నారు. పాలక మండలిని రద్దు చేసి, నామినేటేడ్ సభ్యున్ని ఎంపిక చేసేలా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒప్పించాలని కోరారు. దీనిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed