- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటి పై వ్యాట్ తగ్గించండి.. బీజేపీ నేతల డిమాండ్..
దిశ, తొర్రూరు: పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ఐదు రూపాయలు, డీజిల్ పై పది రూపాయలు తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించింది అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించకుండా పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పండే ప్రతీ గింజా తామే కొంటాం అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, కేంద్రం పై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె కుమార్, రచ్చ కుమార్, అలిసేరి రవిబాబు, పూసాల శ్రీమాన్, బొమ్మనబోయిన కుమార్, నూనె అనిల్, మంగళపళ్ళి యాకయ్య, గుడిమళ్ళ వెంకటేశ్వర్లు, రాయపురం రాజకుమార్, కాగు నవీన్, నడిగడ్డ ఉపేందర్, వేల్పుగొండ రవితేజ తదితరులు పాల్గొన్నారు.