మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం

by Shyam |
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం
X

దిశ, రాజేంద్రనగర్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ పార్టీలో చేరి తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్ పోర్టుకు భారీగా తరలివచ్చారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, 184 మంది కార్యకర్తలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి భారీ హంగులతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇదే సమయంలో ఎయిర్ పోర్టు పోలీసు సిబ్బంది, బీజేపీ శ్రేణులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. అధిక సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపుచేసే సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story