వలస కూలీలకు బీజేపీ చేయూత

by Shyam |   ( Updated:2020-03-31 22:53:55.0  )
వలస కూలీలకు బీజేపీ చేయూత
X

దిశ, మహబూబ్‌నగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు వలస కూలీలకు చేయుతను అందించేందుకు ముందుకు వచ్చారు. బీజేపీ మిడ్జిల్ మండల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి గ్రామంలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణ పనుల నిమిత్తం బీహార్ నుంచి వలస వచ్చిన వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో 41 మంది కూలీలకు 2 క్వింటాళ్ల బియ్యం, పప్పులు, కూరగాయలను, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS : BJP, distributing, rice, migrant workers, BIHAR, MAHABUBNAGAR, JP NADDA

Advertisement

Next Story

Most Viewed