- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి: బీజేపీ నేతలు
గువహతి: అసోంలోని మూడు కొండ ప్రాంత జిల్లాలు కర్బి అంగ్లాంగ్, పశ్చిమ కర్బి అంగ్లాంగ్, దీమా హసావోలతో స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ మూడు జిల్లాలకు చెందిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఏకైక బీజేపీ ఎంపీ కేంద్రానికి మెమోరాండం అందించారు. ఆర్టికల్ 244(ఏ)ను అమలు చేసి అసోంలోనే మరో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసోంలోని కొండప్రాంత ప్రజల దశాబ్దకాల డిమాండ్ ఇది అని బీజేపీ ఎంపీ హోరెన్ సింగ్ బీ తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తితే కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపిందన్నారు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొండ ప్రాంత ప్రజల హక్కు అని, వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్వయం పాలిత రాష్ట్రం కోసం డిమాండ్ చేయవచ్చునని తెలిపారు.