- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌ని కలిసే యత్నం.. బీజేపీ నాయకులు అరెస్ట్
దిశ, మరిపెడ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెరేడుచర్లలో జరిగిన దాడిని నిరసిస్తూ ఆయన్ను కలిసేందుకు మంగళవారం సూర్యాపేట వెళ్తున్న బీజేపీ నాయకులను మరిపెడ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మరిపెడ మండల బీజేపీ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని, రైతులతో మాట్లాడేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న బండి సంజయ్‌పై దాడి హేయనీయమన్నారు. యాసంగి వడ్ల కోసం వానాకాలం వడ్లను కొనకుండా.. ఐకేపీ కేంద్రాలను ప్రారంభించకుండా రైతుల కష్టాన్ని నీళ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కోతలు, అమ్మకాల సమయంలో అధికార పార్టీ ధర్నాలు నిరసనలు అంటూ రైతన్నలను అయోమయంలోకి నెట్టివేస్తోందని ఆక్షేపించారు.
యాసంగిలో కూడా కేంద్రం బాయిల్డ్ ధాన్యం మాత్రమే కొనటం కుదరదని, మిగతా ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొంటారని స్పష్టం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులపై దాడులు, అరెస్టులు చేయటం మానేసి వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ మరిపెడ పట్టణ భూక్య శ్రీనివాస్, భూక్య కాంతమ్మ, జనార్దన్, తదితరులు ఉన్నారు.