- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆ కానిస్టేబుల్ నిర్వాకానికి బీజేపీ నాయకులు గరం..గరం.. కానిస్టేబుల్ ఏం చేశాడంటే..?
దిశ, జమ్మికుంట: విచారణ కోసం వచ్చిన బీజేపీ నాయకులపై పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా చేయి చేసుకున్నారంటూ ఆరోపిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక పోలీస్ స్టేషన్ ముందు ఆ పార్టీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చించి వేశారంటూ గ్రామ బీజేపీ నాయకులు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై కిరణ్ రెడ్డి పోలీస్ సిబ్బందితో విచారణ నిమిత్తం హిమ్మత్‌నగర్ గ్రామానికి వెళ్ళాడు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న క్రమంలో గ్రామస్థాయి బీజేపీ నాయకులు సైతం అక్కడకు చేరుకున్నారు.
సీసీ ఫుటేజీ పనిచేయకపోవడంతో ఓ బీజేపీ కార్యకర్త ఎందుకు పని చేయడం లేదని అని ప్రశ్నించడంతో కానిస్టేబుల్ కొట్టాడని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా నాయకులు వీణవంక కు చేరుకొని పోలీసుల ఎదుట ధర్నాకు దిగారు. సదరు కానిస్టేబుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, నరసింహ రాజు, నాయకులు మల్లారెడ్డి, గౌతమ్ రెడ్డి,గడ్డం స్వామి, సురేందర్ రెడ్డి, బాబురావు, మోరే స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- bjp protest