మేం తెగిస్తే జైళ్లు చాలవు: విజయశాంతి

by Anukaran |   ( Updated:2021-02-03 09:03:46.0  )
మేం తెగిస్తే జైళ్లు చాలవు: విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. వరంగల్‌లో బీజేపీ నేతల వాహనాలు, ఇళ్లు, పార్టీ ఆఫీస్‌లపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అంతగాక 44మంది బీజేపీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేసి వేధించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్ట్‌లు కొత్త కాదన్న విజయశాంతి.. మేం తెగిస్తే జైళ్లు చాలవన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వరంగల్ వెళ్లి ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story