అనాథ ఆశ్రమంగా మారిన తెలంగాణ

by Shyam |
అనాథ ఆశ్రమంగా మారిన తెలంగాణ
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం రణరంగంలా మారింది. ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటూ రాజకీయ రగడ సృష్టిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం హాలియాలో జరిగిన రోడ్‌షోలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… చావు నోట్లో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రస్తుతం రాష్ట్ర ప్రజలను చావుకు దగ్గర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని అనాథ ఆశ్రమంగా మార్చారని మండిపడ్డారు.

Advertisement

Next Story