టీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది: స్వామిగౌడ్

by Shyam |
టీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది: స్వామిగౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని బీజేపీ నేత స్వామిగౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దురుద్దేశంతోనే సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం కాదన్న స్వామిగౌడ్.. 1.50లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తోందని తెలిపారు.

Advertisement

Next Story