‘ఓటమి భయంతోనే.. రంగంలోకి హరీశ్ రావు’

by Shyam |
‘ఓటమి భయంతోనే.. రంగంలోకి హరీశ్ రావు’
X

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని కోరారు. చింతమడకలో ఇంటికి పది లక్షలిచ్చిన కేసీఆర్.. దుబ్బాక ప్రజలకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కేవలం చింతమడక ప్రజలు ఓటేస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడా? అని ప్రశ్నించారు. దుబ్బాక లో ఉప ఎన్నికలు వచ్ఛినాయని, రఘునందన్ రావు ప్రచారం చేయడాన్ని చూసి ఓర్వలేక, దుబ్బాకలో ఓడిపోతామేమోననే భయంతో ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దించారని విమర్శించారు. దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి లారీలు, డీసీఎంలలో కులసంఘాలను తోల్కపోయి కులానికి పది లక్షలు, ఇరవై లక్షల ప్రొసీడింగ్ కాపీలు ఇస్తున్నట్టు భ్రమలోకి దింపుతున్నారని ఆరోపించారు. ఇలా సంఘాల పేరుతో కులాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed