- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిడితే కేసులు పెడుతామని బెదిరిస్తారా..?
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌ను తిట్టినా.. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ బెదిరించడాన్ని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వరంగల్‌లో సోమవారం అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్‌ను తిడితే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని, కానీ అసెంబ్లీ వేదికగా మీరు సన్నాసులని మాట్లాడిన విషయం గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై విమర్శలు చేయొద్దని అంటున్నారని, మీరు మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేలను తిట్టవచ్చా అని నిలదీశారు. బాధ్యత గల మినిస్టర్ హోదాలో ఉండి ప్రధాని, కేంద్ర హోం మంత్రి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానని చెప్పడం భావ్యమేనా అని కడిగిపారేశారు. దుబ్బాకతో టీఆర్ఎస్‌కు మతిపోయిందని, జీహెచ్ఎంసీలో వచ్చిన రిజల్ట్స్‌తో వారు భయపడ్డారన్నారు. సాగర్‌లో కూడా టీఆర్ఎస్‌కు భంగపాటు తప్పదని, వరంగల్, ఖమ్మంలోనూ ఓడిపోవడం ఖాయమన్నారు.