కేసీఆర్‌కు మాట మీద నిలబడే చరిత్ర లేదు !

by Shyam |
కేసీఆర్‌కు మాట మీద నిలబడే చరిత్ర లేదు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన నిజాంను మించిపోయిందని బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. సోమవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా నాయకుడు కాదని, మోసకారని తీవ్రంగా మండిపడ్డారు. 1200మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుంటుంబం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. బీజేపీని అణగదొక్కడం కేసీఆర్ వల్ల కాదని, కేసీఆర్ అవినీతిపై కేంద్రం నిఘా పెట్టిందని, రెండేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. సన్నరకం వడ్లు వేసి రైతులు నష్ట పోయారని, కేసీఆర్‌కు మాట మీద నిలబడే చరిత్ర లేదన్నారు. వరదల్లో 100మంది చనిపోతే ఒక్కరినీ కూడా కేసీఆర్ పరామర్శించలేదన్నారు.

Advertisement

Next Story