మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది

by Shyam |
మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయంలో శుక్రవారం జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ పవన్ కల్యాణ్‌‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అంతేగాకుండా దేశంలో బీజేపీకి, మోడీ న్యాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారు అన్నారు. వరదలు లేని మురికి రాని ఇల్లు కావాలని అవినీతి లేని పాలన కావాలని కోరుకుంటున్నారు అని వెల్లడించారు. గులాబీ గ్రాఫిక్స్ కాకుండా ప్రజలు ప్రాక్టికల్ అభివృద్ధి కోరుకుంటున్నారని గుర్తు చేశారు. అది బీజేపీ తోనే సాధ్యం అనే విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ కూడా మాతోకలిసి రావాలని కోరాం. పవన్ కూడా బీజేపీ విజయం కోసం పని చేస్తామన్నారు అని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలు తప్పక మార్పు తీసుకొస్తారని, ఆ మార్పులో జనసేన భాగస్వామ్యం అవుతుంది అని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed