- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాది ఉద్యమ చరిత్ర.. మీవన్నీ కుట్రలు, కుతంత్రాలే : ఈటల
దిశ, జమ్మికుంట : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో పాటు నేను కూడా ఉద్యమానికి అండగా నిలిచి, నిరంతరం పోరాటం చేసి రాష్ట్ర సాధనలో భాగస్వామి అయ్యానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. తీరా రాష్ట్రం సిద్ధించాక ఉద్యమ, తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కించి తనను దూరం చేశాడని కేసీఆర్ పై ఈటల ఫైర్ అయ్యారు. గురువారం ఇల్లందకుంట మండలం సీతంపేట, బూజునూరు, వంతడుపుల గ్రామాలతో పాటు జమ్మికుంట మండలంలోని నగురం, వావిలాల గ్రామాల్లో ఈటల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉంటూ ప్రజల కోసం ప్రశ్నిస్తే తనను కావాలని ప్రభుత్వం నుండి తీసేయించారని మండిపడ్డారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే నంటే నేను అంటూ ఇక్కడికి చాలా మంది వస్తున్నారని.. తాను నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని చిలక పలుకులు పలుకుతున్నారని.. తమ తమ నియోజకవర్గాల్లో నా కంటే ఎక్కువ అభివృద్ధి చేశారా..? చెప్పాలన్నారు.
తనను ఓడించడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని.. రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాలన్నీ ఈ నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం ఏంటని విరుచుకుపడ్డారు. డబ్బులు పంచి ప్రలోభ పెట్టి గెలవాలని చూసేవారు మీరని కానీ, తాను ప్రేమతో గెలిచిన వాన్ని నేనని చెప్పుకొచ్చారు. ఎన్నో వేలమంది కుటుంబాలను ఆదుకుంటున్న చరిత్ర నాదని, ఇక్కడి ప్రజలకు నాకు ఉన్న అనుబంధం 18 ఏళ్లదని గుర్తుచేశారు. వావిలాల మండల కేంద్రం కావాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. రైతుబంధు, గొర్రెల పథకాలను తాను వ్యతిరేకించలేదని, 2018లో నన్ను ఓడించడానికి మూడు రంగుల జెండా పట్టుకున్న వ్యక్తికి డబ్బులు పంపించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. అది తప్పైతే ముక్కు నేలకు రాస్తానని.. నీవు వస్తావా? అని కేసీఆర్‌ని ఉద్దేశించి సవాల్ విసిరారు. నాలాంటి బక్కపలుచనోన్ని ఓడించటానికి ఇప్పటికే ఎన్నో కోట్లు ఖర్చు చేశావో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సొంత పార్టీల నాయకులను కొనుక్కునే నీచ సంస్కృతి కారు పార్టీలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.