- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యప్రదేశ్‌లో కమలం జోరు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ తన దూకుడును కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపఎన్నిక ఫలితాల్లో కమలం పార్టీ తన పట్టును నిలుపుకుంది. 28 స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ 20 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. మిగతా స్థానాల్లో BSP-1, INC-7 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. బైపోల్ ఫలితాల సరళిపై సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వలన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన సపోర్టర్స్ 25 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరి తమ శాసన సభ్వత్వాలకు రాజీనామా చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోగా ఏర్పడిన మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు నేడు వెలువడుతుంటంతో సింధియా వర్గీయులు తిరిగి గెలుపుదిశగా దూసుకుపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లభించినట్లు అయింది.