- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్-19ను రాజకీయం చేయొద్దు : పెద్దిరెడ్డి
దిశ , మెదక్: కొవిడ్-19ను రాజకీయం చేయకుండా ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని బీజేపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు జన్‌ధన్ ఖాతాల్లో రూ.1500, ప్రతి మనిషికి 5కిలోల బియ్యం, కుటుంబానికి నెలకు 1కిలో కందిపప్పును కేంద్రం అందిస్తోందని ఆయన వివరించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనాను ఎదుర్కొనేందుకు రూ. 200కోట్ల నిధులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెస్టులు పెంచి, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ప్రభుత్వమే ఫ్రీగా వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, చంద్రశేఖర్, నర్సారెడ్డి, హనుమంత్ రెడ్డి, సంగారెడ్డి బీజేవైయం జిల్లా అధ్యక్షులు పవన్ ముదిరాజ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వరరావు దేశ్ పాండే, పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్, పోలీస్ శేఖర్, విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.