- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ, తెలంగాణలో గణేశ్ మండపాల బ్యాన్‌పై బీజేపీ ఫైర్..
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు గణేశ్ మండపాల ఏర్పాటుపై నిషేధం విధించాయి. ఈ నిర్ణయంపై బీజేపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పేరుతో రాజకీయాలు చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో ప్రస్తుతం మద్యం షాపులు నడిస్తే తప్పులేదు కానీ, గణేశ్ పండుగపై ఎందుకని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ను ప్రశ్నించారు. దీనిపై ఇరువురు సీఎంలు మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. వినాయక చవితి విషయంలో ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ప్రభుత్వానికి రాసిన లేఖపై స్పందిస్తూ.. గణేశ్ మండపాలపై అధికారిక సమావేశం ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో మొహరం పండుగకు సంబంధించి ముందస్తు అనుమతులు ఇచ్చారు కానీ, వినాయక చవితి విషయంలో ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విష్ణు ప్రశ్నించారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాదా అని విమర్శించారు.
హిందూ సమాజం అన్ని విషయాలు గమనిస్తోందని, సరైన సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారని విష్ణు వ్యాఖ్యానించారు. కాగా, కరోనా కేసుల నేపథ్యంలో గణేశ్ మండపాల ఏర్పాటుపై నిషేధం విధించిన తెలుగు ప్రభుత్వాలు ఎవరి ఇంట్లో వారే పండుగ జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. కాగా, ఇదివరకే బీజీపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.