- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెప్టెన్ ఇలాఖాలో టీఆర్ఎస్‌కు మరో దెబ్బ
దిశ, హుజురాబాద్ రూరల్, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ‘దళితబంధు’ పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన శాలపల్లి ఓటర్లు కేసీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతరావు ఇలాఖాలో టీఆర్ఎస్‌కు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి మంచి పట్టున్న తుమ్మనపల్లి, బోర్పపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఆధిక్యం రావడం చర్చనీయాశంగా మారింది. ఈటల రాజకీయ ప్రస్థానంలో ఆయనకు మద్దతుగా ఈ గ్రామాల ప్రజలు అండగా నిలవడం తొలిసారే అని చెప్పొచ్చు. మరోవైపు హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలోనూ ఈటల 90 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నప్పటికీ అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు అండగా నిలబడకపోవడం విశేషం.