Huzurabad ఉప ఎన్నిక షెడ్యూల్ .. బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్

by Sridhar Babu |   ( Updated:2021-09-29 02:13:42.0  )
Huzurabad ఉప ఎన్నిక షెడ్యూల్ .. బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్
X

దిశ ప్రతినిది, కరీంనగర్ : బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రపై నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2న సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగించాల్సి ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం అక్టోబర్1 నుండి నోటిఫికేషన్ జారీ అవుతుండడంతో బీజేపీ నాయకత్వం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ముగింపు సమావేశాన్ని భారీగా ఏర్పాటు చేసి హుజురాబాద్‌లో ప్రభావం చూపాలనుకున్నారు బీజేపీ నాయకులు. దీనివల్ల ఈటల రాజేందర్ గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోందన్న ధీమాతో ఉన్నారు.

కానీ షెడ్యూల్లో విధించిన నిబంధనలు పాదయత్ర ముగింపు సభకు ఆటంకంగా మారాయని అంచనా వేస్తున్నారు. 500 మందికి మించి సభలకు హాజరు కాకూడదన్న నిబంధన వల్ల సభను ఏర్పాటు చేసే అవకాశం లేదని చర్చించుకుంటున్నారు. కమిషన్ విధించిన నిబంధనను అతిక్రమించి సమావేశం ఏర్పాటు చేసినా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రత్యామ్నాయంగా మరో చోట ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై చర్చిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం 500 మందితోనే పరిమితం చేయాలంటే అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్ షోతో ప్రజా సంగ్రామ యాత్రకు ముగింపు పలకాలని సూచించినట్టు సమాచారం. ఖచ్చితంగా హుజురాబాద్ లోనే ఈ కార్యక్రమానికి ముగింపు ఇవ్వాలని ఆయన కొరినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ నాయకత్వం ఉన్నత స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed